బొచ్చ చేప @ 30 కేజీలు.. శ్రీశైలం బ్యాక్వాటర్లో చేపల వేట

 బొచ్చ చేప @  30 కేజీలు.. శ్రీశైలం బ్యాక్వాటర్లో చేపల వేట

ఎర్రవల్లి చౌరస్తా, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని షేక్ పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్  కృష్ణ వలకు 30 కిలోల బరువు ఉన్న 5 చేపలు చిక్కాయి. సోమవారం శ్రీశైలం బ్యాక్​వాటర్​లో చేపల వేటకు వెళ్లగా, ఏకంగా బొచ్చ రకానికి చెందిన 30 కిలోల బరువు ఉన్న చేపలు దొరకడంతో ఆనందం వ్యక్తం చేశాడు. శ్రీశైలం బ్యాక్  వాటర్  తగ్గడంతో కృష్ణా నదిలో నీటి నిల్వలు తగ్గి భారీ చేపలు జాలర్లకు దొరుకుతున్నాయి.