అసెంబ్లీలో మీడియా లాంజ్ తొలగింపు..ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు

అసెంబ్లీలో మీడియా లాంజ్ తొలగింపు..ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో మీడియా లాంజ్ తొలగించడంతో జర్నలిస్టులు సోమవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత సెషన్ వరకు లాబీల్లో ఉన్న మీడియా లాంజ్‌‌ను ఈ సెషన్‌‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయించారు. దీంతో జర్నలిస్టులకు కూర్చోవడానికి చోటు లేకపోవడం, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాబీల్లో ఉన్న టాయిలెట్లకు అధికారులు తాళాలు వేయగా ఇబ్బందులు పడ్డారు.

మంత్రుల ఛాంబర్లలో కూర్చుందామనుకున్నా.. అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో చాన్స్​ లేకుండా పోయింది. ఈ అంశాన్ని మీడియా కమిటీ దృష్టికి తీసుకెళ్లగా, వారు అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే మీడియా లాంజ్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ లాబీల్లోని శ్రీపాదరావు సెంట్రల్ హాల్‌‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. దీంతో మీడియా లాంజ్‌‌ను తొలగించాల్సి వచ్చింది