కోల్‌బెల్ట్, వెలుగు : డిటోనేటర్ పేలడంతో నలుగురు సింగరేణి కార్మికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కాసీపేట-2 బొగ్గు గనిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మధ్యాహ్నం గనిలోని నార్త్డిస్ర్టిక్ట్, 22 లెవల్, 18 ఎక్స్డిప్ ప్రాంతంలో మ్యాన్‌హోల్స్ (ప్రమాదాల నుంచి తప్పించుకొని రక్షణగా ఉండే స్థలం) ఏర్పాటు కోసం కోల్కట్టర్కార్మికులు రమేశ్, పుప్పాల శ్రీనివాస్, రాజ్‌కుమార్, సపోర్ట్మెన్క్రాంతి కుమార్బ్లాస్టింగ్పనులు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ డిటోనేటర్మిస్ఫైర్కావడంతో బొగ్గు పెళ్లలు, బొగ్గు చూర నలుగురికి తగలడంతో గాయాలయ్యాయి. కార్మికులను ముందుగా మందమర్రి కేకే డిస్పెన్సరీకి అనంతరం రామకృష్ణాపూర్సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కార్మికులను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, కార్మిక సంఘాల లీడర్లు పరామర్శించారు. ఇద్దరు కార్మికులను కరీంనగర్, హైదరాబాద్‌కు తరలించారు.
