- డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి ఫైర్
కోల్‌బెల్ట్, వెలుగు: దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించే స్థాయి, నైతిక హక్కు బాల్క సుమన్‌కు లేదని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పి.రఘునాథ్‌రెడ్డి, క్యాతనపల్లి టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఫైర్అయ్యారు.
రామకృష్ణాపూర్‌లోని కాంగ్రెస్ ఆఫీస్‌లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి వివేక్‌పై బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పదేండ్లు ఎంపీ, ఎమ్మెల్యేగా కొనసాగిన సుమన్ చెన్నూరు నియోజకవర్గానికి, ప్రజలకు చేసింది శూన్యమన్నారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే యువతను రెచ్చగొడుతూ వారిని జైలు పాలు చేస్తూ పబ్బంగడుపుకుంటున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన చెన్నూరు నియోజకవర్గాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారని పేర్కొన్నారు.
అభివృద్ధి చేస్తున్న మంత్రికి అడ్డంకులు సృష్టించడం సరికాదని, నియోజకవర్గంపై చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి సహకరించాలని బాల్క సుమన్‌కు సూచించారు. సమావేశంలో టీపీసీసీ ఎస్సీ సెల్ కార్యదర్శి చందనగిరి శ్రీనివాస్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజేశ్, కార్యదర్శులు వెనిగాల శ్రీనివాసరావు, పైడాకుల శ్రీనివాస్, కొక్కుల సతీశ్, బొద్దుల ప్రేమ్ సాగర్, రాజ్ కుమార్, పోగుల లచ్చులు, అందుగుల మల్లేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
