గండిపేట, వెలుగు: ఫోక్డ్యాన్సర్ మాధురి రాథోడ్ సోమవారం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫోక్డ్యాన్సర్ఈశ్వర్ సాయిపై తాను గతంలో పెట్టిన కేసుకు సంబంధించి మరోసారి స్టేట్మెంట్ ఇచ్చారు. కేసు నమోదై 16 రోజులు గడుస్తున్నప్పటికీ ఈశ్వర్ సాయిని ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. మాధురి రాథోడ్ స్టేట్మెంట్ను నమోదు చేసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని చెప్పినట్లు తెలిసింది. ఈశ్వర్ సాయిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
