సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో శాసనసభ లోపల, వెలుపల ఉద్రిక్త వాతావరణంలో రెండోరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు మహిళా శాసన సభ్యులకు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని మంత్రి తెలిపారు. నిన్న ( సెప్టెంబర్7) జరిగిన ఘటనను పూర్తిగా విచారణ చేస్తామన్నారు. పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
