మహిళా పోలీసుల ముందు బట్టలు విప్పాల్సిన అవసరమేంటి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీతక్క ఫైర్

మహిళా పోలీసుల ముందు బట్టలు విప్పాల్సిన అవసరమేంటి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీతక్క ఫైర్

హైదరాబాద్: మహిళా పోలీసుల ముందు బట్టలు విప్పాల్సిన అవసరమేంటని బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అసెంబ్లీ గేట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హంగామా, స్పీకర్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం (సెప్టెంబర్ 8) అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. 

స్పీకర్‎ను దూషించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీ గేట్ దగ్గర మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టింది ఎవరూ.. మహిళా పోలీసుల ముందు బట్టలు విప్పింది ఎవరని ప్రశ్నించారు. స్పీకర్‎ను ఆయన తల్లిని దూషించి ఇప్పుడు లేదని దబాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడులు చేయడం సబబేనా అని నిలదీశారు. 

అసెంబ్లీలో రూల్ తెచ్చిందే మీరు.. మీరే పాటించరా అని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లకారం భాషతో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక, తమ చీర లాగారు.. కొట్టారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు చెబుతున్నారు.. నిజంగా మహిళా సభ్యులపై దాడి జరిగితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై కూడా కేసులు పెడతామని చెప్పారు.