సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ లో చ.గ.నికి రూ. 1.64 లక్షలు..వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.71.44 కోట్ల ఆదాయం

సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ లో చ.గ.నికి రూ. 1.64 లక్షలు..వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.71.44 కోట్ల ఆదాయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా సరూర్​నగర్ మండల పరిధిలో హెచ్ఎండీఏ 4,356 చదరపు గజాల భూమిని సోమవారం వేలం వేసింది. ఇక్కడ  చదరపు గజానికి రూ.1.50 లక్షలు కనీస ధరగా నిర్ణయించగా, పోటాపోటీగా సాగిన బిడ్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చదరపు గజానికి అత్యధికంగా రూ.1,64,000 ధర నమోదైంది. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏకు మొత్తం రూ.71.44 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. 

సరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఈ భూమి ఉండటం వల్ల మంచి ధర పలికింది. ఈ ప్రాంతానికి ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ నగర్, దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తోపాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇతర ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతాలకు మంచి రవాణా సౌకర్యం ఉండటం కలిసి వచ్చే అంశమని అధికారులు పేర్కొన్నారు.