మియామిలో విమాన ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

మియామిలో విమాన ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

వాషింగ్టన్: అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్టులో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పోర్టో రికోలోని శాన్ జువాన్ నుంచి వచ్చిన అమెజాన్ కార్గో విమానం ల్యాండింగ్ టైంలో అదుపుతప్పి రన్‌‌‌‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఆ వెంటనే సమీపంలోని వాహనాలను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు.

ఈ ప్రమాదంతో విమానంలో మంటలు చెలరేగి, ఘటనాస్థలమంతా దట్టమైన పొగ వ్యాపించింది.  అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పైలట్‌‌‌‌, కోపైలట్‌‌‌‌తో పాటు వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని, విమానం కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడారు.