ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేస్తున్న ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థకు చెందిన ఒక కార్గో విమానం భారీ ప్రమాదానికి గురైంది. రన్వేపై టైర్లు పెట్టిన వేగానికి బ్రేకులు ఫెయిలై క్షణాల వ్యవధిలో మృత్యువు కమ్ముకుంటే ఆ విమానం గమ్యస్థానం కాస్తా శ్మశాన వాటికగా మారింది. అవును.. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో సృష్టించిన బీభత్సానికి సంబంధించిన విజువల్స్ ప్రపంచాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి?
పోర్టో రికోలోని శాన్ జువాన్ నగరంలో బయలుదేరిన ప్రైమ్ ఎయిర్ ఫ్లైట్ 7598.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ కావాల్సిన విమానం అదుపుతప్పి రన్వేను దాటి దూసుకెళ్లి సమీప రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టింది.
విమానంలో తరలుతున్న వస్తువులు ఏమిటి?
అమెజాన్ ఈ-కామర్స్ ఆర్డర్ల డెలివరీ వేగవంతం చేయడానికి ప్రైమ్ ఎయిర్ సేవలను భారీగా ఉపయోగిస్తోంది. ఈ కార్గో విమానంలో కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన నిత్యవసరాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు సహా వివిధ రకాల ప్యాకేజింగ్ వస్తువులు రవాణా అవుతున్నాయని సమాచారం. విమానం బరువు, క్షణాల్లో మారిన వాతావరణ పరిస్థితులు ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🚨 Update: Deadly Cargo Plane Crash at Miami International Airport
— FL360aero (@fl360aero) September 7, 2026
At least five people have died and five others were injured after an Amazon Prime Air cargo aircraft overran the runway at Miami International Airport on Sunday afternoon, striking multiple vehicles and bursting… pic.twitter.com/6XLpT6mVaP
ఈ దుర్ఘటన వెనుక కొన్ని కీలక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బోయింగ్ 767 విమానం వయస్సు దాదాపు 32 సంవత్సరాలు. మొదట దీనిని ప్రయాణికుల విమానంగా వాడి.. ఆ తర్వాత 2015లో కార్గో విమానంగా మార్చారు. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి మయామిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో గంటకు 30 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీయటం విమానాన్ని అదుపుతప్పేలా చేసిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఈ ప్రమాదంలో 5 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విమానం ఇంజిన్ ప్రాంతంలో చెలరేగిన మంటలను అర్పడానికి సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. ఈ ఘటన కారణంగా మయామి ఎయిర్‌పోర్ట్‌లో వందలాది విమానాలు రద్దయ్యాయి, దారి మళ్లించబడ్డాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి.
