మెక్సికో: మెక్సికోలోని టెమాస్కాల్సింగోలో శనివారం రాత్రి విషాద ఘటన జరిగింది. చర్చి పండుగ సందర్భంగా వేడుక జరుగుతుండగా బాణసంచా పదార్థాలు పేలడంతో గోడ కూలింది. ఈ ఘటనలో పది మందికి పైగా చనిపోయారు. 64 మందికి పైగా గాయపడ్డారు.
📍🇲🇽 #México Nueve personas murieron y 24 resultaron heridas tras el estallido de fuegos artificiales durante una fiesta patronal en Santa María Canchesdá, en el municipio de #Temascalcingo. pic.twitter.com/jgItsFuoCZ
— Radio 580 Nicaragua (@radio580nic) September 6, 2026
ఈ పేలుడు ధాటికి గోడలు కూలిపోవడంతో వందలాది మంది భయాందోళనలతో పరుగులు తీశారని మెక్సికన్ అధికారులు తెలిపారు. నుయెస్ట్రా సెనోరా డి లా లూజ్ చర్చి పక్కన ఈ పేలుడు జరిగింది. ఈ పట్టణం మెక్సికో సిటీకి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్గా మారాయి.
Explosión deja nueve mu3rt0s y más de 40 h3rid0s en Estado de México
— Sol Yucatán (@SoldeYucatan) September 6, 2026
Una fu3rt3 3xplos1ón registrada en la comunidad de Santa María Cachesdá dejó un saldo preliminar de nueve personas fallecidas y más de 40 h3rid4s, además de provocar el colapso de parte de la iglesia del… pic.twitter.com/0QcyE4LSoo
ప్రజలు సంబరాల్లో భాగంగా.. బాణ సంచా వెలుగుల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే.. కొన్ని రౌండ్ల తర్వాత ఆ బాణసంచా అదుపు తప్పి పేలడం మొదలైంది. ప్రజలు స్పందించే లోపే బాణసంచా నుండి వెలువడిన పొగ గాలిలోకి వ్యాపించింది. వెంటనే మంటలు చెలరేగడం, గోడ కూలిపోవడం జరిగింది.
►ALSO READ | నేపాల్ లో ఇంకా 5 వేల మంది మిస్సింగ్.. ఇప్పటి వరకు 1,344 మంది ప్రాణాలు కోల్పోయారు
మెక్సికో రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తును ప్రారంభించింది. గాయపడిన వారిలో ఇద్దరు చర్చి పాస్టర్లు కూడా ఉన్నారని స్థానిక బిషప్ తెలిపారు. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం కొందరు వెతుకుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా అనిపించాయి.
#WATCH | Mexico: Fireworks Blast At Church Festival Kills 10, Injures 64
— ET NOW (@ETNOWlive) September 7, 2026
At least 10 people were killed and 64 injured after stored pyrotechnic material exploded near a church in Santa María Canchesdá during patron saint festivities. The blast caused part of the structure to… pic.twitter.com/ojBARkstQJ
బాణసంచాతో అలంకరించిన గడ్డి ఎద్దును తగలబెట్టి, పట్టణం చుట్టూ ఊరేగించే ఒక సాంప్రదాయ ఉత్సవం ఈ పట్టణంలో జరుగుతుంది. అది ఇక్కడి ఆచారం. ఈ సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. జనం చర్చి బయట గుంపులు నిలబడి ఉండగా ఈ పేలుడు సంభవించినట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది.
#Mexico: At least 10 people were killed and dozens injured after stored fireworks exploded during an evening mass in Santa Maria Canchesda.
— DD News (@DDNewslive) September 7, 2026
The blast occurred in the church atrium as residents gathered for celebrations ahead of their patron saint festival. pic.twitter.com/NuNIaQVlXo
సుమారు 66 వేల మంది నివాసితులున్న టెమాస్కాల్సింగో పట్టణంలో పేలుడు సంభవించిన సమయంలో వందలాది మంది ఆ ప్రాంతంలో ఉన్నారు. మెక్సికోలో వీధి వేడుకలు, మతపరమైన పండుగలు, ఇతర బహిరంగ సమావేశాల సమయంలో బాణసంచాను చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.
