నోబెల్ ఎటూ ఇవ్వలేదు.. కనీసం ఈ అవార్డ్ అయినా ఇవ్వండి : ట్రంప్ రిక్వస్ట్ మామూలుగా లేదుగా

నోబెల్ ఎటూ ఇవ్వలేదు.. కనీసం ఈ అవార్డ్ అయినా ఇవ్వండి : ట్రంప్ రిక్వస్ట్ మామూలుగా లేదుగా

అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు అవార్డుల పిచ్చి ఎంతలా ఉందో ఈ మధ్య ఆయన చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది. నోబెల్ ప్రైజ్ పై ఆశలు పెంచుకుని.. చివరికి భారత సంతతి వ్యక్తికి దక్కేసరికి కుళ్లుకున్న ట్రంప్.. ఇప్పుడు మరో ప్రతిపాదన తెస్తున్నారు. నోబెల్ ఎలాగో దక్కలేదు. కనీసం పులిట్జర్ ప్రైజ్ వచ్చినా బాగుండు అంటూ తన మనసులోని మాట బయటపెట్టారు . 

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను ఆపానని డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్.. ప్రపంచ శాంతి కోసం పాటు పడినందుకు నోబెల్ ప్రైజ్ తనకే వస్తుందని చాలా సార్లు అన్నారు. పరోక్షంగా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నోబెల్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. అయితే 2026 నోబెల్ శాంతి బహుమతి భారత సంతతికి చెందిన నవీ పిళ్లైకి ఇచ్చే సరికి ఆయన ఆశలు అడియాశలయ్యాయి. 

నోబెల్ రాలేదనే అసంతృప్తితో ఉన్న ట్రంప్.. లేటెస్టుగా సౌత్ కరోలినా ర్యాలీలో మాట్లాడుతూ.. కనీసం పులిట్జర్ ప్రైజ్ అన్న తనకు రావాలని తన మనుసులో మాట బయటపెట్టారు. 

  రష్యాపై ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కవరేజీ చేసిన జర్నలిస్టులకు 2026లో  పులిట్జర్ బహుమతులు దక్కాయి. అయితే అవార్డులు గెలుచుకున్న జర్నలిస్టుల కథనాలు తప్పుగా ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు. నాకు నోబెల్ బహుమతి రాలేదు. నాకు పులిట్జర్ రాలేదు. కనీసం నా రచనకు  పులిట్జర్ వచ్చి ఉండాల్సింది అని ట్రంప్ అన్నారు.

 పులిట్జర్ బహుమతులు అనేవి అమెరికన్ జర్నలిజం, సాహిత్యం, నాటకం,  సంగీత రంగాలలో సాధించిన విజయాలను గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక వార్షిక పురస్కారాలు అందజేస్తారు.  

ALSO READ : అమెజాన్ లాంటి కంపెనీనే.. రాత్రికి రాత్రి వెయ్యి మంది ఉద్యోగులను తీసేసింది

అయితే పులిట్జర్ ప్రైజ్ విషయంలోనూ ట్రంప్ అక్కసు బయటపెట్టారు. ఆ అవార్డును ఎవరైతో పొందారో వాస్తవానికి  వాళ్ళు దాన్ని పొందకూడదు, మీకు తెలుసా? రష్యా, రష్యా, రష్యా అనే అంశంపై వారు చేసిన కచ్చితమైన, అద్భుతమైన రచనకు వారికి పులిట్జర్ బహుమతి లభించింది అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. రష్యాపై రచనలకు అవార్డులు ఇచ్చారు కానీ వారు పొరబడ్డారు. వారందరూ పొరబడ్డారు, అంటూ  నోబెల్ శాంతి బహుమతి తిరస్కరణపై తన అసంతృప్తిని ప్రస్తావించే ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 ట్రంప్ రచనలు:

 ట్రంప్ కూడా కొన్ని రచనలు చేశారు. తన రచనలలో రచన చూసి ఈ అవార్డు ఇవ్వమంటున్నారో స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఆయన రాసినవి పర్సనల్ ఫైనాన్స్ మొదలైన అంశాలపై ఉంటాయి. 

తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌పై చేసే అసంబద్ధమైన వ్యాఖ్యలు కాకుండా, ట్రంప్ బిజినెస్, స్ట్రాటజీ, రాజకీయాలపై దాదాపు 20 పుస్తకాలను ప్రచురించారని సమాచారం. అయితే   గోస్ట్‌రైటర్‌లతో కలిసి పుస్తకాలు రాసినట్లు తెలుస్తోంది. తన రాజకీయ జీవితం ప్రారంభం కాకముందే, ట్రంప్ 1987లో తన పేరు మీద మొదటి పుస్తకాన్ని ప్రచురించారు. ది ఆర్ట్ ఆఫ్ ది డీల్  అనే ఆ పుస్తకాన్ని గోస్ట్‌రైటర్ టోనీ స్క్వార్ట్జ్ రాశారు.

ట్రంప్ తన పుస్తకాలను రాయడానికి గోస్ట్‌రైటర్లను, సహ రచయితలను నియమించుకుంటూ ఉంటారు. ట్రంప్  రాసిన రచనలలో సెల్ఫ్ హెల్ప్ బుక్స్, పర్సనల్ ఫైనాన్స్, పొలిటికల్ బుక్స్, ఆటోబయోగ్రఫీలు ఉన్నాయి