స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) పరిధిలోని రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్ఎస్పీ)లో ఐజీహెచ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 112.
విభాగాల వారీగా ఖాళీలు: మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్ 100, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ 07, ఓటీ/ అనెస్తీషియా అసిస్టెంట్ ట్రైనింగ్ 05.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి, ఇంటర్మీడియట్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్, మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ విభాగాల్లో ఎంబీఏ, బీబీఏ లేదా పీజీ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ igh.sailrsp.co.inను సందర్శించండి.
