మంగళవారం గోల్డ్ గేమ్ స్టార్ట్.. హైదరాబాదులో గ్రాముకు ఎన్ని వేలు పెరిగిందంటే?

మంగళవారం గోల్డ్ గేమ్ స్టార్ట్.. హైదరాబాదులో గ్రాముకు ఎన్ని వేలు పెరిగిందంటే?

గడచిన రెండు రోజులుగా తగ్గుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం రోజున ట్రెండ్ రివర్స్ కావటంతో బులియన్ మార్కెట్లలో పసిడి పరుగులు తిరిగి స్టార్ట్ అయ్యింది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరత్వాన్ని పాటిస్తున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని మారిన రేట్లను పరిశీలించి ప్లాన్ చేసుకోవటం బెటర్. 

సెప్టెంబర్ 8న బంగారం రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 7 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.120 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 535గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 240గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 8, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.