హైదరాబాద్‌‌లో 4 మిచెలిన్ టైర్స్ సెంటర్స్ 

హైదరాబాద్‌‌లో 4 మిచెలిన్ టైర్స్ సెంటర్స్ 

హైదరాబాద్​, వెలుగు: ఫ్రాన్స్‎కు చెందిన టైర్ టెక్నాలజీ సంస్థ మిచెలిన్ హైదరాబాద్‌‌లో సోమవారం నాలుగు టైర్స్ అండ్ సర్వీసెస్ కేంద్రాలను ప్రారంభించింది. జూబ్లీహిల్స్, సరూర్‌‌నగర్, గండిమైసమ్మ, కొంపల్లి ప్రాంతాలలో ఇవి ఏర్పాటయ్యాయి. మనదేశంలోనే తయారైన ప్రైమసీ 5 ప్యాసింజర్ వెహికల్ టైర్లను వీటిలో కొనుక్కోవచ్చు. 

ప్రపంచ స్థాయి రిటైల్ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తయారు చేశామని కంపెనీ తెలిపింది. ప్రత్యేక సర్వీస్ బేలు, ఆధునిక పరికరాలు, కస్టమర్ల విశ్రాంతి గదులు ఈ కేంద్రాల్లో ఉంటాయి.  లగ్జరీ వాహనాలకు డిమాండ్​ను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేశామని మిచెలిన్ పేర్కొంది.