HDFC బ్యాంక్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. లోన్లపై వడ్డీ తగ్గింపు 

HDFC బ్యాంక్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. లోన్లపై వడ్డీ తగ్గింపు 

న్యూఢిల్లీ: హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ కొన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్‌‌ లోన్ రేట్లకు (ఎంపీఎల్‌‌ఆర్‌‌‌‌) 10 బేసిస్ పాయింట్ల (0.10శాతం) వరకు కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు సోమవారం  నుంచే  అమలులోకి వచ్చాయి. ఈ తగ్గింపుతో ఎంసీఎల్‌‌ఆర్ ఆధారంగా తీసుకున్న హోమ్‌‌, వెహికల్ లోన్ బారోవర్ల ఈఎంఐ  స్వల్పంగా తగ్గుతుంది. తాజా సవరణ అనంతరం హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌‌ఆర్ రేట్లు 7.90శాతం నుంచి 8.60శాతం మధ్య ఉన్నాయి.  

గతంలో ఇవి 8.00శాతం నుంచి 8.65శాతం వరకు ఉండేవి. ఓవర్‌‌నైట్, 1 నెల, 3 నెలలు, 6 నెలలు, ఒక ఏడాది,  2 ఏళ్లు, మూడేళ్ల కాల పరిమితి గల లోన్ల ఎంసీఎల్‌‌ఆర్ రేటు తగ్గింది.  ప్రస్తుతం బ్యాంక్ బేస్ రేటు 8.70శాతం వద్ద, బెంచ్‌‌మార్క్ పీఎల్‌‌ఆర్ (బీపీఎల్‌‌ఆర్‌‌‌‌) 17.20శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఫిక్స్​డ్​ డిపాజిట్లపై  సాధారణ పౌరులకు 2.75శాతం నుంచి 6.50శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25శాతం నుంచి 7శాతం వరకు వడ్డీని హెచ్‌‌డీఎఫ్‌‌సీ అందిస్తోంది.