న్యూఢిల్లీ: భారతీయ ఇన్వెస్టర్లు గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు స్టాక్ బ్రోకింగ్యాప్ అప్‌స్టాక్స్ సంస్థ కొత్త సేవలను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ఇన్వెస్టర్లు అమెరికాకు చెందిన 8000కు పైగా స్టాక్స్, 2000 ఈటీఎఫ్‌లలో ట్రేడింగ్ చేయవచ్చు. యాపిల్, టెస్లా, అమెజాన్, గూగుల్ వంటి ఎంఎన్సీల షేర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ విధానం ద్వారా ఒక డాలర్ విలువ గల పెట్టుబడి కూడా పెట్టొచ్చు. దీనివల్ల పూర్తి షేరు కొనకుండా కొంత భాగం సొంతం చేసుకోవచ్చు. భారత్‌లోని బ్యాంక్ ఖాతాల ద్వారా రూపాయల్లోనే ఖాతాలో నిధులు జమ చేయవచ్చు. ఆ రూపాయిలు ఆటోమేటిక్‌గా డాలర్లలోకి మారతాయి.
