వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ వడోదర పర్యటన సభ కోసం దేశంలోనే తొలిసారిగా 'బుక్‌మైషో' ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్లు నిర్వహించారు. గంటల వ్యవధిలోనే అన్ని సీట్లు బుక్ కావడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అప్పటికే 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్టులో చేరారు. ఈ మంగళవారం వడోదరలో రూ.35 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభిస్తారు.
సభకు హాజరయ్యే వారికి బుక్‌మైషో అకౌంట్‌లో లైవ్ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ 'ఎం-టికెట్'ను కేటాయించారు. రిజిస్ట్రేషన్ నుంచి వేదికలోకి ప్రవేశించే వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్‌గానే నిర్వహిస్తుండటంతో రద్దీ తగ్గి రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు.
