కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు తెచ్చే యోచనలో కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు తెచ్చే యోచనలో కేంద్రం
  • కేంద్ర సర్కార్‌‌‌‌ ఉద్యోగుల ‘రీల్స్‌‌‌‌’కు బ్రేక్‌‌‌‌
  • త్వరలో సోషల్ మీడియా కోడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కండక్ట్‌‌‌‌ తెచ్చే యోచన
  • ఆఫీసర్లు, కింది స్థాయి సిబ్బందికీ ఒకే రకమైన రూల్స్

న్యూఢిల్లీ: ఉద్యోగులు సోషల్ మీడియాలో వ్యక్తిగత రీల్స్, వీడియోలు, అభిప్రాయాలు పోస్టు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సోషల్ మీడియా ప్రవర్తనా నియమావళిని(కోడ్​ ఆఫ్ కండక్ట్) రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించినట్లు సమాచారం. 

కొంతమంది అధికారులు ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, యూట్యూబ్‌‌‌‌ వంటి వేదికల్లో రీల్స్​ పోస్టు చేస్తున్నారు. వాటిలో అధికారిక, వ్యక్తిగత కంటెంట్‌‌‌‌ కలిసిపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అన్ని శాఖలకు వర్తించేలా ఒకే రకమైన సోషల్ మీడియా నిబంధనలు లేవు. ఆయా శాఖల సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ఆధారంగానే చర్యలు ఉంటున్నాయి. 

కొత్తగా తీసుకురానున్న నియామావళిలో ఎలాంటి పోస్టులు చేయాలి, ఏం చేయకూడదు, ఏవి నేరంగా పరిగణించాలి, ఎలాంటి శిక్షలు విధించాలనే అంశాలను స్పష్టంగా పేర్కొనే అవకాశం ఉంది. మరోవైపు, కేంద్రం ‘ఏక్‌‌‌‌ భారత్‌‌‌‌’ పోర్టల్‌‌‌‌ను వేగంగా అందుబాటులోకి తేవాలని ఎలక్ట్రానిక్స్‌‌‌‌, ఐటీ శాఖను ప్రధాని ఆదేశించారు.

 ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ఉద్దేశం. డిజిటల్‌‌‌‌ నియంత్రణలో భాగంగా చట్టవిరుద్ధ కంటెంట్‌‌‌‌ను తొలగించే గడువును 36 గంటల నుంచి మూడు గంటలకు కేంద్రం ఇటీవల తగ్గించింది. ఏఐతో రూపొందించిన కంటెంట్‌‌‌‌ను స్పష్టంగా గుర్తించడంతో పాటు దాని మెటాడేటాను భద్రపరచాలని సంస్థలను ఆదేశించింది.