తెలుగు కలినరీ విస్తరణ బాట.. మరో 3  రెస్టారెంట్ల ఏర్పాటు

తెలుగు కలినరీ విస్తరణ బాట.. మరో 3  రెస్టారెంట్ల ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: తెలుగు వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ఎఫ్‌‌ అండ్‌‌ బీ ఫౌండర్లు రోహిత్, గోపీచంద్ హైదరాబాద్‌‌లో అనగనగ తెలుగు కలినరీ టేల్స్ పేరుతో రెస్టారెంట్‌‌ను ప్రారంభించారు. జూబ్లీహిల్స్​లో 200 మంది కూర్చునే సామర్థ్యంతో ఈ ప్రీమియం తెలుగు స్పెషాలిటీ రెస్టారెంట్‌‌ను ఏర్పాటు చేశారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరో మూడు కొత్త రెస్టారెంట్లను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. విశాఖపట్నం, బెంగళూరు నగరాలలో కూడా శాఖల ఏర్పాటుకు ఒప్పందాలు తుది దశకు చేరాయి.  మూడేళ్లకుపైగా కొనసాగిన సుదీర్ఘ పరిశోధన తర్వాత తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను ఈ రెస్టారెంట్లో అందిస్తున్నారు.