ఇండియా స్పేస్ సెక్టార్‌‌‌‌లో 2 లక్షల ఉద్యోగాలు 

ఇండియా స్పేస్ సెక్టార్‌‌‌‌లో 2 లక్షల ఉద్యోగాలు 

న్యూఢిల్లీ: ఇండియా స్పేస్ సెక్టార్‌‌‌‌లో 440 ప్రైవేట్ స్టార్టప్‌‌లు రిజిస్టర్ కాగా ఇవి రాబోయే రోజుల్లో  2లక్షల హై-స్కిల్డ్ ఉద్యోగాలను క్రియేట్ చేస్తాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. భారత స్పేస్‌‌ స్టార్టప్‌‌లలో ప్రైవేట్ పెట్టుబడులు 2021-22లో 100.5 మిలియన్ డాలర్లు ఉండగా, మార్చి 2026 నాటికి దాదాపు ఆరు రెట్లు పెరిగి 618.5 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధ్రువ స్పేస్ వంటి స్టార్టప్‌‌ సంస్థలు రాకెట్లు, శాటిలైట్లు, ప్రొపల్షన్ రంగాల్లో రాణిస్తున్నాయి. ఇస్రో కూడా రాకెట్ల తయారీని పూర్తిగా ప్రైవేట్‌‌ సెక్టార్‌‌‌‌కు అప్పగిస్తామని ప్రకటించడంతో మరిన్ని స్టార్టప్‌‌లు వచ్చే అవకాశం ఉంది.