మంత్రి వివేక్, ఎంపీ వంశీ చొరవతో..అసంఘటిత కార్మికులకు ప్రత్యేక చట్టం : డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి

మంత్రి వివేక్, ఎంపీ వంశీ చొరవతో..అసంఘటిత కార్మికులకు ప్రత్యేక చట్టం : డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి

కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రివివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృ ష్ణ చొరవతో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మి కుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేలా కృషి చేస్తామని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పి.రఘునా థ్ రెడ్డి అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దె రాగడి భరత్ నగర్ లో బిల్డింగ్స్ పెయింటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కొత్త కార్యాలయాన్ని మున్సి పల్ చైర్ పర్సన్ గొడిసెల సుధారాణి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత గాండ్లసమ్మయ్యతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంతో కృషిచేశారన్నా రు. మంచిర్యాలలో ఉన్న అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలాచూస్తామన్నారు.

అసంఘటిత కార్మికులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేలా కృషి చేస్తామన్నారు. ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసేలా మంత్రి, ఎంపీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బిల్డర్స్ పెయింటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్య క్షుడు మంచర్లసదానందం, పట్టణ అధ్యక్షుడు బత్తుల మీనయ్య. ఉపాధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్, కాంగ్రెస్, సీపీఐ పార్టీల లీడర్లు వొడ్నాల శ్రీనివాస్, పల్లె రాజు, మిట్టపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు భూమయ్యగౌడ్, స్వర్ణలత పాల్గొన్నారు.