జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం వద్ద శ్రావణమాస సందడి నెలకొంది. ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం చివరి వారం కావడంతో భక్తులు 26వ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. గుడి ప్రాగణంలో పట్నాలు చెల్లించి బోనాలను సమర్పించి, గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
