జగిత్యాల టౌన్, వెలుగు: విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరిధిలోని సిబ్బందికి విధులు కేటాయించే విషయంలో ఆర్ఐ కిరణ్ కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. కొంతమంది సిబ్బందికి ఎలాంటి డ్యూటీలు కేటాయించకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ దందాపై బాధితుల నుంచి నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమని తేలడంతో ఆర్ఐని సస్పెండ్ చేశారు.
