తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ( సెప్టెంబర్ 7 ) ఉదయం అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నిరసనలు, సభ లోపల బీజేపీ నిరసనలతో నెలకొన్న గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి సమావేశాలు. 22A భూముల అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో నిరసనకు దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో 22A భూముల అంశంపై చర్చకు తాము సిద్ధమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధమని... బీజేపీ సభ్యులు లేవనెత్తిన ఏ అంశమైనా చర్చకు సిద్ధమేనని అన్నారు శ్రీధర్ బాబు.BACలో తీసుకున్న నిర్ణయం తర్వాత షార్ట్ డిస్కషన్ కు రెడీ అని స్పష్ఠం చేశారు.
అయితే.. సభలో ప్లకార్డులతో నిరసనకు దిగారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని...బీజేపీ సభ్యులు సహకరించాలని కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రస్నోత్తరాల తర్వాత చర్చకు అనుమతిస్తామని అన్నారు స్పీకర్.
