తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరవుతూనే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నానా హంగామా సృష్టించారు. దీంతో అసెంబ్లీ గేటు దగ్గర పరిస్థితి అదుపు తప్పడంతో హరీశ్ రావు, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. బ్లాక్ టీ షర్ట్లతో అనుమతించమని పోలీసులు తెలిపారు.
ప్రజా సమస్యలను చర్చించేందుకు వెళ్లాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు.. నల్ల రంగు దుస్తులతో హాజరయ్యేందుకు వచ్చారు. దీంతో అక్కడున్న పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. అసెంబ్లీ గేటు ఎదుట బీజేపీ.. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. బీఆర్ఎస్ నేతలకు తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీషర్ట్స్ విప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
