- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రామడుగ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం దేశరాజ్పల్లిలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ బిల్డింగ్, రూ.4.16 లక్షలతో విశ్వబ్రాహ్మణ సంఘ భవనం, రామడుగులో రూ.50 లక్షలతో మహిళా సమాఖ్య భవనం, రూ.24 లక్షలతో నిర్మించనున్న ఈఆర్వో భవనానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోడ్లను అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో రాజేశ్వరి, తహసీల్దార్ రాజమల్లయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుమల, గంగాధర ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎ.లచ్చయ్య, అంజనీప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజి హరీశ్, సింగిల్ విండో చైర్మన్ కోల రమేశ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో కొండగట్టుకు సీఎం రేవంత్ రెడ్డి
కొండగట్టు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కొండగట్టుకు రానున్నట్లు ఎమ్మెల్యే సత్యం తెలిపారు. రూ.50 లక్షల ఎండోమెంట్ నిధులతో కొండగట్టులో నిర్మిస్తున్న వాహన పూజ షెడ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అంతరాలయంలోని స్వామివారికి నవంబర్ లో చందనోత్సవం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి సీఎంను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్ పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
