భారత్ వృద్ధి భేష్.. ఇంటర్నేషనల్ గ్రోత్ రేట్ కంటే మనదే స్పీడ్

భారత్ వృద్ధి భేష్.. ఇంటర్నేషనల్ గ్రోత్ రేట్ కంటే మనదే స్పీడ్

హైదరాబాద్, వెలుగు: బజాజ్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సదస్సులో మన ఎకానమీపై సానుకూల అంచనాలను ప్రకటించింది. దీని రిపోర్ట్​ప్రకారం.. అంతర్జాతీయ వృద్ధి కంటే భారత్ వేగంగా దూసుకుపోతోంది. 2027 నాటికి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.7శాతంకి చేరుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ, డేటా సెంటర్లు, తయారీ రంగం, ప్రీమియమైజేషన్​వంటివి దేశ ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. గృహనిర్మాణం, డిజిటల్ సేవలు, ఆర్థిక రంగాలలో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 

ఏఐ కేవలం సాంకేతిక సంస్థలకే పరిమితం కాకుండా అన్ని రంగాల ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతోంది. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు 2030 నాటికి రూ.130.5 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. ప్రభుత్వ మౌలిక వసతుల వ్యయం, స్థిరమైన విదేశీ పెట్టుబడులు రాబోయే కాలంలో మార్కెట్లకు అదనపు బలాన్ని చేకూరుస్తాయని ఈ సదస్సు స్పష్టం చేసింది.