న్యూఢిల్లీ: భారీ జీతం ఉండే వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు గత నెల వార్షికంగా14శాతం పెరిగాయి. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, రిటైల్ రంగాలు ఈ వృద్ధికి ప్రధాన కారణమని నౌకరీ జాబ్‌స్పీక్ రిపోర్ట్వెల్లడించింది. మొత్తం జాబ్‌స్పీక్ ఇండెక్స్ గత ఏడాది ఆగస్టులోని 2,664 స్థాయి నుంచి ఈసారి 3,028కి చేరుకుంది. పండుగ సీజన్ క్యాలెండర్ మారడం వల్ల ఈ లెక్కలను జాగ్రత్తగా పరిశీలించాలని ఇన్ఫో ఎడ్జ్ సీఈవో హితేష్ ఒబెరాయ్ తెలిపారు.
ఆటోమొబైల్ రంగంలో 19శాతం, హెల్త్‌కేర్‌లో 16శాతం, రిటైల్‌లో 15శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. ఫ్రెషర్ల నియామకం 15శాతం వృద్ధి చెందగా, అనుభవం కలిగిన ఉద్యోగులకు కూడా డిమాండ్ బాగా ఉంది. నగరాల వారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 23శాతం వృద్ధి నమోదైంది. కోల్‌కతా, చెన్నై నగరాలు కూడా మెరుగైన స్థానాల్లో నిలిచాయి. భువనేశ్వర్, రాయ్‌పూర్ వంటి చిన్న నగరాల్లో కూడా నియామకాలు ఊపందుకున్నాయి.
