ఖాట్మాండు: నేపాల్‌లో భారీ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1,357కు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, తాజాగా మరికొన్ని మృతదేహాలను వెలికితీశారు. నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 13,583 మందిని రక్షించగా, గల్లంతైన 5,326 మంది కోసం రెస్క్యూ టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి. వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రసువా, నువాకోట్, ధాడింగ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే షెల్టర్లలో సుమారు 3,500 మంది తలదాచుకున్నారు. ఇండ్లు కోల్పోయిన మరికొందరు పాఠశాలలు, దేవాలయాలు, మఠాలు, ఖాళీ ప్రభుత్వ భవనాలు, టెంట్లలో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు, వరద ప్రభావిత జిల్లాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
