6 నెలలు, 41 మ్యాచ్‌లు.. బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్: భారత ఆటగాళ్లకు నరకం ఖాయం?

6 నెలలు, 41 మ్యాచ్‌లు.. బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్: భారత ఆటగాళ్లకు నరకం ఖాయం?

41 Matches In 6 Months: శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత దొరికిన చిన్నపాటి రెస్ట్ ముగియడంతో భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టబోతోంది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభమయ్యే వరకు టీమిండియా ఏకంగా 41 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 7 టెస్ట్‌లు, 14 వన్డేలు, 20 టీ20లు ఉన్నాయి. సెప్టెంబర్ 13 (ఆదివారం) నుంచి సొంతగడ్డపై ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే 3 టీ20ల సిరీస్‌తో భారత క్రికెట్ రచ్చ మళ్లీ మొదలుకానుంది.

ఆసియా గేమ్స్‌లో శ్రేయస్ సేన: 

ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ ముగియగానే సొంతగడ్డపై వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. సరిగ్గా ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని మరొక ఇండియన్ టీమ్ జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026లో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 22న జపాన్‌తో ఏకైక చారిత్రాత్మక టీ20 మ్యాచ్ ఆడాక, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆసియా గేమ్స్ పతకాల పోరులో టీమిండియా పోటీపడనుంది. ఆ వెంటనే అక్టోబర్ చివర్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అక్కడ 2 టెస్ట్‌లు, 5 వన్డేలు, 5 టీ20ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.

గాయాల భయం.. బీసీసీఐ రోటేషన్ పాలసీ: 

ఈ బిజీ షెడ్యూల్ కారణంగా కీలకమైన ఆటగాళ్లు గాయాలపాలయ్యే ప్రమాదం ఉండటంతో బీసీసీఐ ఉన్నతాధికారుల రివ్యూ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ ప్లేయర్లకు తగిన విశ్రాంతిని ఇస్తూ రోటేషన్ పాలసీని వర్తింపజేయాలని ఫిక్స్ అయ్యారు. సీనియర్లకు కాలానుగుణంగా రెస్ట్ ఇస్తూ, యంగ్ ప్లేయర్లను రిజర్వ్ బెంచ్ ద్వారా రంగంలోకి దించడమే దీని ప్రధాన ఉద్దేశం.

టీమిండియా అప్‌కమింగ్ షెడ్యూల్: 

* భారత్ vs ఆఫ్ఘనిస్థాన్: 3 టీ20లు (సెప్టెంబర్ 13 - 17)
* జపాన్ vs భారత్: ఏకైక టీ20 (సెప్టెంబర్ 22)
* భారత్ vs వెస్టిండీస్: 3 వన్డేలు, 5 టీ20లు (సెప్టెంబర్ 27 - అక్టోబర్ 16)
* ఆసియా గేమ్స్ 2026: 3 టీ20లు (సెప్టెంబర్ 28 - అక్టోబర్ 3)
* న్యూజిలాండ్ vs భారత్: 2 టెస్ట్‌లు, 5 వన్డేలు, 5 టీ20లు (అక్టోబర్ 22 - నవంబర్ 27)
* భారత్ vs శ్రీలంక: 3 వన్డేలు, 3 టీ20లు (డిసెంబర్ 13 - 27)
* భారత్ vs జింబాబ్వే: 3 వన్డేలు (జనవరి 3 - 7, 2027)
* భారత్ vs ఆస్ట్రేలియా: 5 టెస్ట్‌ల బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ (జనవరి 21 - ఫిబ్రవరి 27, 2027)
* ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్ గావాస్కర్ ట్రోఫీ ముగియగానే, మార్చి మొదటి వారంలో ఐపీఎల్ 2027 హంగామా షురూ కానుంది.