సోషల్ ఐసోలేషన్‌, ఒంటరితనం మధ్య తేడా ఏంటి ? ఈ సమస్య నుండి బయటపడటం ఎలా అంటే ?

 సోషల్ ఐసోలేషన్‌, ఒంటరితనం మధ్య తేడా ఏంటి ? ఈ సమస్య నుండి బయటపడటం ఎలా అంటే ?

“ఒంటరితనం ! ఈ మాట వినగానే మనం ఏం ఆలోచిస్తాం ? దీని గురించి మనం ఏం చదివామో దాదాపు అదే మనకు తెలుసు. దాన్నే ఒంటరితనం అనుకుంటాం. దాన్ని బేస్ చేసుకొనే ఫీలింగ్ లోన్లీ' అని అప్రయత్నంగా అంటుంటాం. అయితే  సోషల్ హెల్త్ రీసెర్చ్ లో ఒంటరితనం మీద మనుషులకు కొన్ని అపోహలు ఉన్నట్టు కనుక్కున్నారు కెస్లీ కిల్లమ్ అనే హెల్త్ కేర్ స్పెషలిస్ట్.

ఒంటరితనం, సోషల్ ఐసోలేషన్ ఈ రెండూ ఒకటే అనుకుంటారు  చాలామంది. ఈ రెండింటిని ఒకే అర్థంతో పిలవడమో, ఒకదానికొకటి పర్యాయపదంగా వాడటమో తరచుగా చూస్తుంటాం. నిజానికి ఈ రెండు వేరు వేరు. సోషల్ ఐసోలేషన్ ఆబ్జెక్టివ్ ఎక్స్ పీరియెన్స్... అంటే ఇది ఇతరుల నుంచి వేరుపడటం. ఇతరుల నుంచి దూరం కావడం లేదా ఇతరులే మనల్ని వెలివేయడం, ఇంట్లో వాళ్లు ఊరికి పోతే ఇంట్లో ఒక్కరమే ఉండటం లాంటివి సోషల్ ఐసోలేషన్ కిందికి వస్తాయి. ఇక, ఒంటరితనం మాత్రం సబ్జెక్టివ్ ఎక్స్ పీరియెన్స్. అంటే ఇది పూర్తిగా మనసుకి సంబంధించింది. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం వాళ్ల నుంచి డిస్కనెక్టెడ్గా ఉంటూ ఒంటరితనాన్ని ఫీలవుతుంటాం. మనం మనల్నీ. మన ఇంట్రెస్ట్ పట్టించుకోని వాళ్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం వల్ల మనసులో ఒంటరితనం మొదలవుతుంది. అంతేకాదు. మనుషులతో లోతైన సంబంధాలు లేకుండా.. పైపైన ఏదో కలిసి ఉన్నాం అన్నట్టు ఉండటం వల్ల కూడా ఒంటరితనానికి కారణమవుతుంది. అర్థవంతమైన రిలేషన్షిప్ లేకపోవడమే 47 శాతం మంది ఒంటరితనానికి కారణమని నేషనల్ స్టడీ రిపోర్ట్ చెస్తోంది. ప్యాండమిక్ టైమ్ లో మనలో చాలామంది కేవలం ఫిజికల్గా మాత్రమే ఐసోలేట్ అయ్యాం కానీ, ఎమోషనల్ గా మనం ఒంటరితనాన్ని ఫీల్ కాకుండా జాగ్రత్త పడాలి. 

వయసుతోపాటే ఒంటరితనం పెరగుతుందా?

వయసుతో పాటే ఒంటరితనం పెరుగుతుందనే అపోహ కూడా ఉంది. కానీ, ఇది నిజం  కాదు. దీనికి వయసుతో సంబంధం లేదు.. రీసెంట్ గా జరిపిన ఒక స్టడీలో... యూత్ లోనే ఎక్కువ ఒంటరితనం ఉన్నట్టు తెలిసింది. నేటి యువత ముందు తరాలతో ఎక్కువగా కలిసి ఉండకపోవడం, వాళ్లతో ఎక్కువగా మాట్లాడకపోవడం కూడా ఈ ఒంటరితనానికి కారణమవుతోంది. దీనికి పెద్దవాళ్లే చొరవ తీసుకొని.. యూత్ ఇంటరాక్ట్ కావడమే సొల్యూషన్. మొత్తానికి వయసుతో సంబంధం లేకుండా ఈ ఒంటరితనం ఉంటుంది. పరిస్థితులను బట్టి ఏ వయసు వాళైనా ఒంటరితనంతో బాధపడే అవకాశం ఉంది.

టెక్నాలజీ వల్లే ఒంటరితనం ?
మనలో ఒంటరితనం పెరగడానికి ప్రధాన కారణాల్లో టెక్నాలజీ కూడా ఒకటని చాలామంది అనుకుంటారు, అంటుంటారు.

కొత్త ఫ్రెండ్ కావాలనిపిస్తుందా ?
ఒంటరితనంతో బాధపడుతుంటే కొత్త ఫ్రెండ్స్ కావాలనే ఫీలింగ్ డెవలప్ అవుతుంది. కొంతమంది కొత్త ఫ్రెండ్స్ కోసం సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెడుతుంటారు. కొత్త సిటీకి మారినప్పుడు, కొత్త ఇంటికి మారినప్పుడు ఆ ఏరియాలో ఎవరూ తెలియదు కాబట్టి, ఒంటరితనం ఫీలవుతుంటాం. నిజానికి కొత్తవాళ్లను ఫ్రెండ్స్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయి. అయితే, ముందుగా ఆల్రెడీ మనకున్న రిలేషన్స్ ని బలంగా మార్చుకోవడం వల్ల సోషల్ హెల్త్ ఇంకా బెటర్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఫీలింగ్స్ ని, మన అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడం వల్లనే రిలేషన్స్ బలంగా మారతాయి.

కొంచెం కూడా బ్రేక్ ఇవ్వకుండా సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని బ్రెయిన్ కు ఫీడ్ చేయడం, ఎప్పుడూ మొబైల్లో గేమ్స్ ఆడటం లాంటి అనారోగ్యకర టెక్నాలజీ అలవాట్లు ఒంటరితనానికి, బాధకు కారణం అవుతాయనడంలో సందేహం లేదు. అయితే, లిమిటెడ్ టెక్నాలజీని వాడుకోవడం వల్ల ఎక్కువగా ప్రయోజనాలే ఉంటాయి. కొత్త మనుషులను కలుసుకోవడానికి, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి, ఎక్కడెక్కడో రిమోట్ ఏరియాల్లో ఉన్న మనుషులతో కనెక్ట్ కావడానికి టెక్నాలజీ ఎంతగానో సాయపడుతుంది. ఇలా మనుషులతో కనెక్ట్ కావడం వల్ల మనకు సోషల్ సపోర్ట్ లభిస్తుంది. సోషల్ వెల్ బీయింగ్ కోసం... సోషల్ మీడియాతో కనెక్టెడ్గా ఉండటం మంచిదే కానీ, దాంతో ఎమోషనల్ ఎటాచ్ మెంట్ పెంచుకుంటే మాత్రం ఒంటరితనం, డిప్రెషన్లోకి వెళ్లడం ఖాయం. ఇష్టమైన వాళ్లతో కనెక్ట్ చేస్తుంది కాబట్టి, స్మార్ట్ ఫోన్ ఒంటరితనాన్ని తగ్గిస్తుందని కొన్ని స్టడీస్ అంటున్నాయి. ఎవరితో ఏమీ షేర్ చేసుకోలేకపోతే ఒంటరితనం వస్తుంది! ఫైనల్గా టెక్నాలజీ తాలూకు మంచి అలవాట్లు ఒంటరితనాన్ని దగ్గరకు రానియ్యవని స్టడీస్ చెప్తున్నాయి. 

ఒంటరితనం మంచిది కాదా?
ఏ డాక్టర్ని అడిగినా.. ఒంటరితనం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే చెప్తారు. అయితే, ఇది అన్ని వేళలా నిజం కాదు. దాదాపు ప్రతి ఒక్కరూ ఒంటరితనాన్ని ఫీలవుతారు. ఇది మనిషికి సంబంధించిన సహజమైన అనుభవం. మనకు అవసరమైంది ఏంటే.. మనకు దొరకడం లేదు అని మెదడు మనకు సిగ్నల్స్ పంపుతున్నప్పుడు కూడా ఒంటరితనాన్ని ఫీలవుతాం. మనల్ని మనం చెక్ చేసుకోవడానికి, మనకేం కావాలో తెలుసుకోవడానికి ఇదే మంచి సందర్భం. అంతేకాదు... ఒంటరితనం క్రియేటివిటీకి పదును పెడుతుంది. చాలామంది ఆర్టిస్టులు, రైటర్స్ తమ అనుభవాలను బయటపెట్టేందుకు ఒంటరితనమే ప్రేరేపిస్తుంది. అయితే, ఒంటరితనం కేవలం క్రానిక్ గా మారుతుందని, డిప్రెషన్లో పడేస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. ఒంటరితనం ఎక్కువకాలం కంటిన్యూ అయినవాళ్లలోనే డిప్రెషన్తో గుండె జబ్బులు వస్తుంటాయి.