ముంబై: ముగ్గురు పశువుల కాపరుల ప్రాణాలు తీసిన T-122 అనే ఆరేళ్ల పులి ఎట్టకేలకు చిక్కింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సావళి అటవీ ప్రాంతంలో శనివారం (అక్టోబర్ 24) మత్తు మంది ఇచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ పులిని బంధించారు. కాగా, T-122 అనే ఆరేళ్ల పులి గత నెల రోజులుగా సామడ, నిల్సాని, పెడ్గావ్, సోనాపూర్, వాఘోలి బుటి ఐదు గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ముగ్గురు పశువుల కాపారులపై దాడి చేసి ప్రాణాలు తీసింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి తలెత్తింది.
ఈ క్రమంలో రాకాసి పులిని పట్టుకోవడానికి సెప్టెంబర్ 27 నుండి అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గతనెల రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న పులి కదలికలను నిశితంగా ట్రాక్ చేశారు. చివరకు సావళి అటవీ ప్రాంతంలో మత్తు మంది ఇచ్చి అటవీ శాఖ అధికారులు పులిని బంధించారు. పులి బోనులో చిక్కడంతో సావళి అటవీ పరిధిలోని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
