ఐదు నెలల తర్వాత హార్దిక్ రీఎంట్రీ.. సాయి సుదర్శన్‌కు చోటు: ఇండియా A స్క్వాడ్ ఇదిగో!

ఐదు నెలల తర్వాత హార్దిక్ రీఎంట్రీ.. సాయి సుదర్శన్‌కు చోటు: ఇండియా A స్క్వాడ్ ఇదిగో!

Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుమారు ఐదు నెలల విరామం తర్వాత మళ్లీ పోటీ క్రికెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వచ్చే నెల పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా ఏ (Australia A) జట్టుతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ఎంపిక చేసిన ఇండియా ఏ టీమ్ లో పాండ్యాకు చోటు లభించింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ 3 వన్డేల సిరీస్‌లో హార్దిక్ పాల్గొనడం అతడి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇండియా ఏ జట్టులో ఎంపికవ్వడంతో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు పాండ్యా దూరం కానున్నాడు.

కెప్టెన్లుగా రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్: 

ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం బీసీసీఐ ఇద్దరు యంగ్ స్టార్లకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండు మల్టీ-డే (4 రోజుల) మ్యాచ్‌ల సిరీస్‌కు కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల శ్రీలంక టెస్టు పర్యటనలో నంబర్-3 స్థానంలో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక అక్టోబర్ 6 నుంచి జరిగే 50 ఓవర్ల వన్డే సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతేనే గ్రౌండ్‌లోకి.. వెస్టిండీస్ సిరీస్‌కు పాండ్యా దూరం: 

హార్దిక్ పాండ్యా రాక కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నప్పటికీ, వైట్ బాల్ సిరీస్ లో అతను ఆడటం అనేది ఎన్‌సీఏ (NCA) ఇచ్చే ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌పైనే మాత్రమే ఆధారపడి ఉంది. ఒకవేళ పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇండియా ఏ తరఫున ఆస్ట్రేలియా ఏపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతాడు. ఆసియా గేమ్స్ క్యాంపెయిన్, విండీస్ సిరీస్ ల నేపథ్యంలో సీనియర్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో యంగ్ ప్లేయర్లను, ఐపీఎల్ 2026లో మెరిసిన స్టార్లను ఎంపిక చేసినట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ల కమిటీ స్పష్టం చేసింది.

ALSO READ : BCCI ప్రభుత్వ పరిధిలోకి ఎందుకు రాకూడదు..

ఇండియా 'ఏ' పూర్తి స్క్వాడ్స్:

మల్టీ-డే జట్టు (4 రోజుల మ్యాచ్‌లు): దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), అమన్ మోఖడే, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, అంశుల్ కంబోజ్, ప్రాఫుల్ హింగే, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్), నాచికేత్ భుతే, వి వైశాఖ్.

వన్డే జట్టు (50 ఓవర్ల సిరీస్): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (ఫిట్‌నెస్‌కు లోబడి), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), గుర్జాప్‌నీత్ సింగ్, యశ్ ఠాకూర్.