కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలో పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లా్ల్లో 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో 540 కిలో మీటర్ల మేర నాలుగు రాష్ట్రాల్లో అదనపు రైల్వే మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టులకు అంచనా వ్యయం రూ.10వేల 021 కోట్లు. 2029–30 నాటికి ఈప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
బుధవారం(సెప్టెంబర్9) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. తమిళనాడులోని అరక్కోనం నుంచి రేణిగుంట వరకు మూడు, నాలుగు లైన్ల రైల్వే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. హోసూరునుంచి ఓమాలూరు వరకు డబ్లింగ్ పనులు, వైట్ ఫీల్డ్ నుంచి బంగారాపేట్ వరకు 3, 4 లైన్ల రైల్వే ట్రాక్ పనులు, సాలెం-కారూర్-దుండిగల్ వరకు రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టనన్నారు. పనులు ఈ ప్రాజెక్టుల్లో భాగంగా సికింద్రాబాద్(ఘట్ కేసర్) నుంచి కాజీపేట వరకు 110 కిలోమీటర్లు మల్టీ ట్రాకింగ్ నిర్మించనున్నారు.
వీటితోపాటు దేశంలో 7 హై డెన్సిటీ రైల్వే క్యారిడార్లలో 11వేల కిలోమీటర్ల మేరు రైల్వే పనులకు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ కారిడార్లను నాలుగు లైన్లుగా, క్వాడ్రప్లింగ్ చేసే పనులను చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక రైల్వే కారిడార్లను ఆధునీకరించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Cabinet approves 5 multitracking projects across 17 districts in Tamil Nadu, Andhra Pradesh, Karnataka & Telangana, adding ~540 km to #IndianRailways network
— All India Radio News (@airnewsalerts) September 9, 2026
Projects entail an estimated cost of ₹10,021 crore and are targeted for completion by 2029–30#CabinetDecisions pic.twitter.com/Elb5KJZRaV
