దేశంలో ఆన్ లైన్ ట్యాక్సీ యాప్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ధీటుగా వీటి వినియోగం పెరుగుతోందని చెప్పచ్చు. ఈ క్రమంలో చండీగఢ్ ప్రభుత్వం ర్యాపిడో, ఉబర్ సంస్థలకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీల అగ్రిగేటర్ లైసెన్స్ లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అగ్రిగేటర్ పాలసీ-2025 నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదిఆరులు.
ఉబర్, ర్యాపిడో కంపెనీల నుంచి సరైన పత్రాలు, రెస్పాన్స్ రాకపోవడంతో లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు. డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ట్రైనింగ్, సరైన చార్జీల విధానం వంటి కీలక నిబంధనలు పాటించకపోవడంలో సంస్థలు విఫలమయ్యాయని తెలిపారు అధికారులు. ఈ క్రమంలో ఆరు నెలల పాటు చండీగఢ్ లో ర్యాపిడో, ఉబర్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
నిబంధనల ఉల్లంఘనతో పాటు రెండు సంస్థలకు సంబంధించిన స్థానిక కార్పొరేట్ ఆఫీసులు కూడా పనిచేయట్లేదని తెలిపారు అధికారులు. కమర్షియల్ నంబర్ ప్లేట్స్ లేకుండా బైక్ ట్యాక్సీ నడుపుతున్నారని... పార్ట్ టైం రైడర్లు నిబంధనలు ఉల్లంగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు.
