భారత రత్న పొందిన సైంటిస్టుకు కూడా SIR కష్టాలు తప్పలేదు... పేరులో ఒక్క అక్షరం తప్పుగా ఉందని...

భారత రత్న పొందిన సైంటిస్టుకు కూడా SIR కష్టాలు తప్పలేదు... పేరులో ఒక్క అక్షరం తప్పుగా ఉందని...

SIR ప్రక్రియ పుణ్యమా అని దొంగ ఓట్లు తీసేయడం అన్నమాట అటుంచితే... చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఓటు కోల్పోతున్నవారు చాలామందే ఉన్నారు. ఏకంగా భారతరత్న అవార్డు పొందిన సైంటిస్టుకు కూడా ఈ కష్టాలు తప్పలేదు. ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న గ్రహీత ప్రొఫెసర్‌ CNR రావుకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. SIR లో ఆయన పేరుకి సంబంధించి తప్పులు  కనిపించడంతో విచారణకు కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు అధికారులు.

92 ఏళ్ళ CNR రావు పేరును 2002 ఓటర్ లిస్టులో Prof C N R Raoగా నమోదవ్వగా.. ప్రస్తుత లిస్టులో Proff C N R Rao గా నమోదు చేశారు. Prof స్థానంలో అదనంగా మరో f చేర్చడంతో గందరగోళం నెలకొంది. SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ సమర్పించిన డీటెయిల్స్, 2002 నాటి ఓటర్ లిస్టు ఆధారంగా ప్రస్తుత జాబితాలోని వివరాలతో సరిపోలేకపోతే సెల్ఫ్ నేమ్ మిస్ మ్యాచ్ గా పరిగణిస్తారు అధికారులు. ఈ క్రమంలో CNR రావుకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు అధికారులు.

ALSO READ ; అక్రమ నిర్మాణాలు బుల్డోజర్లతో కూల్చేయండి..

ఈ క్రమంలో CNR రావును బెంగుళూరులోని మల్లేశ్వరంలోని IISC దగ్గర ఉన్న కేంద్రానికి స్వయంగా హాజరు కావాలని తెలిపారు అధికారులు.CNR రావుకు 2014లో భారతరత్న పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మూడో శాస్త్రవేత్తగా ఆయన నిలిచారు CNR రావు.