దేశంలోనే మొట్టమొదటిసారిగా తిరుమల వెళ్లే భక్తులకు LIC ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచాలని నిర్ణయించింది టీటీడీ. ఈమేరకు బుధవారం ( సెప్టెంబర్ 9 ) టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అంతే కాకుండా తిరుమలలో సహజంగా మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయాలని నిర్ణయించింది టీటీడీ. ఈ పథకం కోసం LIC సంస్థకు రూ.2.12 కోట్లు చెల్లించనుంది టీటీడీ. దేశంలోనే తొలిసారిగా టీటీడీ భక్తుల కోసం LICతో కలిసి ప్రత్యేక గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తోందని అన్నారు టీటీడీ ఈవో రవిచంద్ర.
ఎవరికి వర్తిస్తుంది:
SSD టోకెన్, రూ.300 టోకెన్ తో పాటు ఎలాంటి వివరాలు లేని సర్వదర్శనం భక్తులకు కూడా బీమా వర్తిస్తుంది. అలిపిరి టోకెన్ లేకుండా క్యూలో ఉన్న భక్తులకు కూడా కవరేజ్ ఉంటుంది.
ఎంత బీమా:
ప్రమాదవశాత్తు మరణానికి బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు.
సాధారణ మరణానికి కూడా తొలిసారిగా రూ.2 లక్షల బీమా కల్పించారు.
