తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్యక్షతన అన్నమయ్య భవనంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 50 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేశసింది పాలకమండలి. ప్రధానంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల లడ్డూ పోటులో 400 మంది అదనపు కార్మికులను నియామించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
డొనేషన్ పాలసీలో స్వల్ప మార్పులు.. నామినీస్ మార్చుకునే అవకాశం కల్పించే అంశంపై కూడా చర్చించారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు సుమారు 1200 మంది కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ వర్తింపుపై నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులు.. శ్రీవారి భక్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ బోర్డ్.
దేశంలో మొట్టమొదటి సారి LIC ద్వారా భక్తులకు బీమా సదుపాయాన్ని కల్పించారు. ప్రమాదశాత్తు మరణించిన వారి కుటుంబాలకు బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా శ్రీవారి క్షేత్రమైన తిరుమలలో సహజంగా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యలకు రూ.2 లక్షలు మంజూరు చేసి ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం LIC సంస్థకు టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు.
టీటీడీలో CPS/NPS పెన్షనర్లు, వారి కుటుంబాలకు EHF సౌకర్యం కల్పిస్తూ, రూ.2 కోట్ల యాజమాన్య వాటాను చెల్లించేందుకు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డ్. IOCL సంస్థ తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుండి వచ్చే ఆహార వ్యర్థ్యాలను విభాగాలవారీగా విభజించి హైడ్రాలిక్ ప్రక్రియ ద్వారా బయో గ్యాస్ తయారు చేసి... టీటీడీ అన్న ప్రసాద కేంద్రానికి సరఫరా చేస్తుంది. ఇందుకోసం బయో గ్యాస్ ప్లాంట్ నిర్వహణను రూ.2.80 కోట్లతో M/s GPS Renewablesకు అప్పగించాలని టీటీడీ పాలకమండలి సమవేశంలో నిర్ణయ్ తీసుకున్నారు.
టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 48 మంది ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడేందుకు అదనపు సిబ్బందికి తిరుమలకు రవాణా ఛార్జీలు ఇచ్చేందుకు 3 సంవత్సరాలకు రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ALSO READ : స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి మాయాజాలం..
చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్లు ఇవ్వాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్సు గడువును మరో మూడేళ్లు (02-11-2026 నుండి 01-11-2029 వరకు) పొడిగించేందుకు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డ్.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.49 కోట్ల ఆర్థిక సాయంలో భాగంగా రూ.7.56 కోట్ల రెండో విడత విడుదల చేయాలని నిర్ణయం. మిగిలిన మొత్తాన్ని పనుల పురోగతి, యుటిలైజేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా విడతల వారీగా విడుదల చేయడం, అదనంగా సరఫరా చేసే 10 MLD నీటికి మాత్రమే 50% రాయితీ వర్తింపజేయడం, ఇందుకు సంబంధించిన MOU కుదుర్చుకునేందుకు ఆమోదం తెలిపింది.
టీటీడీ ఈహెచ్‌ఎఫ్ పథకం కింద మే–జూలై 2026 కాలంలో రూ.5 లక్షలకు మించిన వైద్య ఖర్చులు చేసిన 15 మంది ఉద్యోగులు/పెన్షనర్లకు మొత్తం రూ.54,66 లక్షల రీయింబర్స్‌మెంట్ మంజూరు చేసేందుకు ఆమోదం...తిరుమల ఎఫ్ఎంఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డూ, వడ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటుకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది.
