తిరుపతి జిల్లా చిట్వేలి–రాపూరు ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది..ఘాట్ రోడ్డులో తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు..
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో తరచూ చిరుతలు రహదారిపైకి రావడంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కొందరికి చిరుతలు కనిపించాయి. ఘాట్ రోడ్డులో చిరుతల సంచారంపై చర్చ జరుగుతోంది.
గత కొంతకాలంగా ఈ మార్గంలో చిరుతలు రోడ్డుకు అడ్డంగా వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణించేందుకు వాహనదారులు భయపడుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చిరుతలు ఎప్పుడు రోడ్డుపైకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
చిరుతలు సంచరించే ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరమని.. అత్యవసరం అయితే తప్ప రాత్రివేళ ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు..ఘాట్ రోడ్డులో చిరుతల సంచారంపై అటవీశాఖ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు..
