నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 2 (సీనియర్ రీసెర్చ్ ఫెలో 1, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1).
విద్యార్హతలు
సీనియర్ రీసెర్చ్ ఫెలో: బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లేదా ఇమ్యునాలజీ విభాగాల్లో ఎంవీఎస్సీ, ఎం.టెక్ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల పరిశోధన, అభివృద్ధి అనుభవం ఉండాలి. సెల్ కల్చర్, జంతువులపై ప్రయోగాలు, ఎలీసా/ ఫాక్స్ ఇమ్యునో అసే, మాలిక్యులర్ బయాలజీలో అనుభవం తప్పనిసరి.
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్: ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. సమావేశాల నిర్వహణలో కనీసం ఐదేళ్ల అనుభవంతోపాటు సూపర్‌వైజరీ పనుల్లో తగినంత అనుభవం ఉండాలి.
వయసు: సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 35 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 9.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 23.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ niab.res.inను సందర్శించండి.
►ALSO READ | మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు.. ఎలాంటి పరీక్ష లేదు.. వివరాలు ఇవే!
