మహబూబ్‌నగర్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) పరిధిలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్- కమ్- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 2 (జూనియర్ అసిస్టెంట్ 1, టైపిస్ట్ కం అసిస్టెంట్ 1).
విద్యార్హతలు
జూనియర్ అసిస్టెంట్: ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్‌పై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.
టైపిస్ట్ కమ్ అసిస్టెంట్: ఆర్ట్స్, సైన్స్, కామర్స్ లేదా లాలో డిగ్రీతోపాటు ఇంగ్లిష్ టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ హైయర్ గ్రేడ్ (నిమిషానికి 45 పదాల వేగం - 45 డబ్ల్యూపీఎం) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్‌పై నైపుణ్యం ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వస్తుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 9.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలు రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (టైపిస్ట్ పోస్టుకు), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ mahabubnagar.dcourts.gov.inను సందర్శించండి.
►ALSO READ | ఇంటర్తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. 2 వేల 536 పోస్టులతో నోటిఫికేషన్
