అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

హైదరాబాద్: శాసన సభ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ మొత్తానికి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, కోవా లక్ష్మి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేష్, విజయుడు, కేపీ వివేకానందను స్పీకర్ సస్పెండ్ చేశారు.

శాసనసభ సమావేశాలు సజావుగా జరగనివ్వాలని.. ప్రతీ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని మంత్రులు శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశాలకు అంతరాయం కలిగించారు.