‘భక్తరామదాసు’ నీటి విడుదల

‘భక్తరామదాసు’ నీటి విడుదల

కూసుమంచి, వెలుగు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల విజ్ఞప్తి మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి ఐబీ డీఈ సురేశ్​275 క్యూసెక్కుల నీటిని స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. తిరుమలాయపాలెం మండలం ఇస్తావత్ తండా బీఎం 60 వద్ద నీటిని ఎత్తిపోశారు.

ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 82 వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో సాగునీటితో పాటు చెరువులను నింపి నీటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో 10 రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని చెప్పారు