బుధవారం దిగొచ్చిన బంగారం రేట్లు.. హైదరాబాదులో తులం ఎన్ని వేలు తగ్గిందంటే?

బుధవారం దిగొచ్చిన బంగారం రేట్లు.. హైదరాబాదులో తులం ఎన్ని వేలు తగ్గిందంటే?

గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ నెమ్మదించటం స్టార్ట్ చేశాయి. దీంతో మంగళవారం పెరిగినట్టే పెరిగిన ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో మారిన రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్. 

సెప్టెంబర్ 9న బంగారం రేట్లు తగ్గాయి. సెప్టెంబర్ 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.104 తగ్గుదల నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 431గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 145గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 9, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీ రూ.2లక్షల 55వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.