చాలామంది ఫిట్నెస్ ప్రియులు ప్రతిరోజు జిమ్ కు వెళ్తుంటారు. అయితే జిమ్ కు వెళ్లేముందు, అలాగే వెళ్లిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
వెళ్లేముందు..
*జిమ్ వెళ్లాలని డిసైడ్ అయినప్పుడు అంతకు ముందు వెళ్లిన జిమ్ అయినా కొత్త జిమ్ అయినా అసలు దాని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే జిమ్ ను అప్ డేట్ చేశారా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకోవాలి.
*జిమ్ లోజ్ ఉండే ట్రెడ్ మిల్, రోయింగ్ మెషిన్, షోల్డర్ ప్రెస్, టెగ్ ప్రెస్,బెంచ్ ప్రెస్. స్పిన్ ఎక్సర్ సైజ్ బైక్ లాంటి ఎక్విప్మెంట్లు ఇరుకుగా ఉండకుండా ఒకదానితో ఒకటి కాస్త దూరంలో ఉండేట్లు సెట్ చేశారో లేదో చూసుకోవాలి.
*విటితో పాటు జిమ్ లో వెంటిలేషన్ సరిగా ఉందా ? లేదా ? అనేది చెక్ చేసుకోవడం కూడా ముఖ్యమే. చాలావరకూ జిమ్లు క్లోజ్డ్ రూమ్ ల్లో ఉంటాయి కాబట్టి వెళ్లేముందు వెంటిలేషన్ సరిగా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి.
వెళ్లిన తర్వాత
*ఒక సారి జిమ్ లోని ఏర్పాట్లన్నీ 'ఓకే' అనుకున్నాక జిమ్ లోపల కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
*జిమీకు వెళ్లేటప్పుడు పర్సనల్ వస్తువులు(వాటర్ బాటిల్, నాప్కిన్స్) వెంట ఉంచుకోవడం మంచిది.
ఒంట్లో బాగోనప్పుడు
*అవసరాన్ని బట్టి ఫిట్ నెస్ స్టైల్ మార్చుకోవాలి. అందుకే వీలుంటే జిమీకు బదులు పిలాటీస్, జుంబా లాంటి వ్యాయామాలు ఎంచుకోవాలి.
*జిమ్ లో ఎయిర్ కండీషనర్ టెంపరేచర్ 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. అలాగే హ్యుమిడిటీ 40 నుంచి 70 శాతం ఉండేలా చూసుకోవాలి.
ALSO READ : సోషల్ ఐసోలేషన్, ఒంటరితనం మధ్య తేడా ఏంటి ?
*జిమ్ లో చేసే ఎక్సర్ సైజుల్లో ప్రతి సెషన్ మధ్య 5-10 నిమిషాల గ్యాప్ ఉండాలి.
*జిమ్ నుంచి ఇంటికెళ్లిన తర్వాత ఇంట్లో స్నానం చేయాలి. అలాగే జిమ్ కు వేసుకెళ్లిన బట్టల్ని ఎప్పటికప్పుడు వాష్ చేయాలి.
