భర్త మధుకర్‌ను అడ్డంగా ఇరికించేసిందా? నందు 'సేఫ్ గేమ్' ఆడుతోందా?

భర్త మధుకర్‌ను అడ్డంగా ఇరికించేసిందా? నందు 'సేఫ్ గేమ్' ఆడుతోందా?

'నందూస్ వరల్డ్' కపుల్ అంటే ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇప్పుడు అదే పేరు చుట్టూ సంచలన ఆరోపణలు, కేసులు.  లండన్‌లో ఉద్యోగాలు, వీసా రెన్యూవల్, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారన్న కేసులో యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. లుక్‌అవుట్ నోటీసు నేపథ్యంలో లండన్ నుంచి హైదరాబాద్ రాగానే ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

వీసా స్కామ్ ఆరోపణలపై ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట తల్లి, లాయర్లతో కలసి హాజరైన నందనను నాలుగు గంటల పాటు విచారించారు. అయితే కేసు విచారణలో ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.   'డెస్టినీ కన్సల్టెన్సీ' వ్యవహారాలు నాకు తెలియవు.. అన్నీ నా భర్త మధుకర్, అకౌంటెంట్ చూసుకుంటారు. నాకు ఎలాంటి సంబంధం లేదు' అన్నట్టుగా ఆమె పోలీసులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ALSO READ : రాముడి కంటే రావణుడికే ఎక్కువ లాభాలా?.. 'రామాయణ'లో యష్‌ మాస్టర్‌ప్లాన్‌!

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఫిర్యాదులో నందనతో పాటు మధుకర్ పేరు కూడా ఉంది. డెస్టినీ కన్సల్టెన్సీకి సంబంధించిన వ్యవహారాల్లో మధుకర్ పాత్రపై ఇప్పటికే పోలీసులు దృష్టి పెట్టారు. శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి సుమారు రూ.15 లక్షలు చెల్లించానని, వీసా, ఉద్యోగం, CoS కోసం డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇచ్చిన CoS నకిలీదని కూడా ఆరోపించారు. ఇంకా పలు చోట్ల ఈ దంపతులపై ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. 

అయితే ఇప్పుడు నందన చెబుతున్న 'అంతా నా భర్తకే తెలుసు' అనే మాటలే కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నిజంగానే ఆమెకు ఈ వ్యవహారాలతో సంబంధం లేదా? లేక తనపై పడుతున్న ఆరోపణు,  లీగల్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి మొత్తం స్కామ్ వ్యవహారాన్ని భర్త మధుకర్ మీదికి నెట్టేస్తున్నారా? లేదా .. తాను అమాయకురాలినని నిరూపించుకునే పక్కా స్కెచ్‌తో నందూ ముందుకు వెళ్తోందా? అన్న సందేహాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

 సోషల్ మీడియా రీల్స్, 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఆఫర్లతో క్రేజ్ తెచ్చుకున్న నందన.. కోట్ల రూపాయల లావాదేవీల గురించి తనకు తెలియదనడం నమ్మసక్యంగా లేదని నెటిజన్లు అంటున్నారు. కేసు తీవ్రత పెరగగానే భర్తను అడ్డంగా ఇరికించేసి సైడ్ అయిపోతోందా? లేక కపుల్ మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయా? అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

పోలీసుల విచారణలో పలు కీలక ప్రశ్నలకు స్పష్టత ఇవ్వకపోవడంతో పోలీసులు నందనకు ఈ నెల 16న మళ్లీ హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. మరో వైన ఆమె భర్తను కూడా త్వరలో విచారిస్తామని పోలీసులు తెలిపారు. మరి త్వరలోనే విచారణకు రానున్న భర్త మధుకర్ నోరు విప్పితే ఈ కేసులో అసలు ట్విస్ట్‌ను బయటపెట్టే అవకాశముంది.