ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డీఐఈవో..కలెక్టరేట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డీఐఈవో..కలెక్టరేట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
  •      కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్

సంగారెడ్డి టౌన్, వెలుగు : కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం తీసుకున్న సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ గోవిందరాంను ఏసీబీ ఆఫీసర్లు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా డీఐఈవో గోవిందరాం ఇటీవల ఓ కాలేజీలో తనిఖీకి వెళ్లి అక్కడ కొన్ని లోపాలను గుర్తించాడు. ఈ క్రమంలో కాలేజీకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాలేజీ యాజమాన్యం ముందుగా రూ.30 వేలు ఇచ్చింది. మిగితా డబ్బులు సైతే ఇవ్వాలని డీఐఈవో ఒత్తిడి చేయడంతో కాలేజీ యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచనతో కాలేజీ నిర్వాహకులు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో ఇంటర్మీడియట్ అధికారి అయిన గోవిందరాంను కలిసి రూ. 20 వేలు ఇచ్చారు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు గోవిందరాంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్ స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్ 
పాల్గొన్నారు.