యాదాద్రి/మదనాపురం వెలుగు: యాదాద్రి కలెక్టరేట్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో వినాయక చవితి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిమజ్జన స్థలాల వద్ద భారీ క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మరోవైపు వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి మదనాపురం పోలీస్ స్టేషన్‌తో పాటు రాంపాడు, కొత్తపల్లి బ్రిడ్జి, సరళ సాగర్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. గణేష్ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, సోషల్ మీడియాలో వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను అలర్ట్చేశారు.
