న్యూఢిల్లీ: వరదలతో అతలాకుతల మైన నేపాల్‌కు భారత్ మరో విడత సాయాన్ని అందించింది. సీ-17 రవాణా విమానం ద్వారా బుధవారం 35 టన్నుల సహాయక సామగ్రిని, పరికరాలను నేపాల్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. నేపాల్‌ను వరదలు ముంచెత్తినప్పటి నుంచి భారత్ నిరంతరం అండగా నిలుస్తోంది. ఆగస్టు 26న ప్రధాని మోదీ నేపాల్ ప్రధానితో మాట్లాడిన గంటల వ్యవధిలోనే తొలి విడత సాయం పంపగా.. ఇప్పుడు మరో విడత సాయాన్ని పంపించారు. కాగా, వరదల ధాటికి మృతుల సంఖ్య 1,365కి చేరింది. ఇంకా 5,326 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
